హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై డాక్టర్ సూరి తెరకెక్కించిన ‘బఘీర’ మూవీ ఈ నెల 31న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ కథను అందించగా.. కన్నడ హీరో శ్రీమురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, గరుడ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.