AP: జగన్ ఆస్తుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి, చెల్లితో ఇంట్లో గొడవైతే తమను మధ్యలోకి లాగుతున్నారని విమర్శించారు. భర్త సంపాదించిన ఆస్తి ఆయన భార్యకు రాదా? అని ప్రశ్నించారు. 2004లో జగన్ ఆదాయం ఎంత అని అడిగారు. ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరోపించారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాలంటే సిగ్గుగా ఉందన్న చంద్రబాబు.. వంకర, చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోండని హితవు పలికారు.