కర్నాటకలో తొలి జీకా వైరస్ కేసు వెలుగు చూసింది. రాయచూర్ జిల్లాకు చెందిన అయిదేళ్ల బాలుడిలో జీకా వైరస్ను గుర్తించారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలినట్లు ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. జీకా వైరస్ను గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. దీనిని ఎదుర్కొనేందుకు తమ శాఖ సంసిద్ధంగా ఉందన్నారు. పుణే లాబ్ రిపోర్ట్ ప్రకారం కర్నాటక రాయచూర్ జిల్లాకు చెందిన అయిదేళ్ల బాలుడికి జీకా వైరస్ పాజిటివ్ వచ్చింది. అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది.
జికా వైరస్ 2016లో బ్రెజిల్లో వెలుగు చూసిన అనంతరం దీనిని ఆందోళన కలిగించే వ్యాధులలో ఒకటిగా పరిగణిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం జికా వైరస్ లక్షణాలు రాషెస్, ఫీవర్, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటివి వస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా రెండు నుండి ఏడు రోజులు ఉంటాయి. 1947లో ఉగాండాలోని జికా అడవిలో మొదటిసారి దీనిని గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా, పసిఫిక్ ఐజ్లాండ్స్లలో వీటిని గుర్తించారు. కొద్ది నెలల క్రితం కేరళ, మహారాష్ట్ర, యూపీలలో కూడా గుర్తించారు.