భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు చల్లారిపోవడం మంచిదేనని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. సరిహద్దు వెంబడి బలగాల ఉపసంహరణకు నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పింది. ఈ విషయాన్ని గమనిస్తూ భారత్తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని యూఎస్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూమిల్లర్ తెలిపారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం వెనుక అమెరికా పాత్ర లేదని ఆయన వెల్లడించారు.