గాజా, లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ ఘటనల్లో గాజాలో 143 మంది, లెబనాన్లో 77 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. లెబనాన్లో భూతల దాడులకు వెళ్లి 33 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయినట్లు సమాచారం. నఖౌరాలోని తమ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన రాకెట్ దాడిలో శాంతి పరిరక్షకులు గాయపడ్డారని UN పేర్కొంది. మరోవైపు గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది.