TG: ప్రభుత్వం ముందుచూపు లేని నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి గండి పడిందని మాజీమంత్రి KTR అన్నారు. ‘BRS హయాంలో స్థిరాస్తి రంగం రయ్.. రయ్ మని పరుగులు పెట్టింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై అంటోంది. పరిపాలన దక్షత లోపం.. విజన్ లేని ప్రభుత్వ విధానాల వల్లే సమస్యలు వస్తున్నాయి. రాష్ట్ర ఆదాయానికి జీవధారమైన రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా వేటు పడింది. దీంతో ఆదాయం సన్నగిల్లింది’ అని పేర్కొన్నారు.