TG: కాంగ్రెస్ సర్కార్ రైతుల సన్న వడ్లకు బోనస్ అనడం మోసమే అని BJLP నేత, MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని, రైతులకు అండగా నిలబడి హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లనే రైతులు ఎక్కువగా పండిస్తారని, కేవలం 20 శాతం మంది పండించే రైతులకే ప్రయోజనం కలుగుతుందన్నారు. బోనస్ భారం తప్పించుకునేందుకే సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతుందని ఎద్దేవా చేశారు.