జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు రెండో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రెండో దశలో ఐదు జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, మొదటి దశ ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైంది.