హర్యానాలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సోనిపట్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీకి మద్దతు పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ రాజకుటుంబం దేశంలో అత్యంత అవినీతి కుటుంబమని ఆరోపించారు. 10 సంవత్సరాల ముందు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు అన్నారు.