»Tragedy In Uttarpradesh Kanwar Yatra Five Died Due To Electric Shock
Electric Shock Five Died : కన్వర్ యాత్రలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఐదుగురు దుర్మరణం
కన్వర్ యాత్ర విషాద యాత్రగా మారింది. విద్యుత్ షాక్‌తో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఉత్తరప్రదేశ్ (Uttarapradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్వర్ యాత్రలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్‌తో ఐదుగురు యాత్రికులు దుర్మరణం(Electric Shock Five Died ) చెందారు. హరిద్వార్ లో పవిత్ర జలాలను తీసుకెళ్తున్న కన్వరీల వాహనం మీరట్‌లో విద్యుత్ షాక్‌కు గురైంది. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు కన్వరీలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
హరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం మీరట్‌కు చేరుకోగానే అందులోని స్పీకర్ హైటెన్షన్ వైరుకు తగిలింది. దీంతో వాహనం మొత్తం విద్యుత్ షాక్(Electric Shock ) రావడంతో అందులోని 10 మందికి తీవ్రం గాయం అయ్యింది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే క్రమంలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కన్వరీల మృతిపై స్థానికులు ఫైర్ అయ్యారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కన్వరీలు మరణించారని నిరసన చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేయడంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అదనపు బలగాలను మోహరించి అక్కడి పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.