»The Centers New Policy Is To Remove Siren For Vip Government Officials And Allow Them To Listen To Indian Music
New Policy: ఇకపై సైరెన్ కు బదులు సంగీతం మోత
వీఐపీ ప్రభుత్వ అధికారులకు సరైన్ తొలగించి, భారతీయ సంగీతం వినపడేలా కేంద్రం కొత్త విధానం తీసుకొస్తున్నట్లు సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీని ద్వారా శబ్దకాలుష్యం తగ్గుతుందని వెల్లడించారు.
New Policy: ప్రోటోకాల్(Protocol)లో భాగంగా ప్రధాని(PM), ముఖ్యమంత్రులు(CM), మంత్రులు(Ministers), వీఐపీ(VIP) కార్లకు సైరన్(Siren) ఉంటుందన్న విషయం తెలిసిందే. సైరెన్ మోగుతుంది అంటే అందులో ఎవరో వీఐపీ వెళ్తున్నారని అర్థం అవుతుంది. అందుకు తగ్గట్టుగానే ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను క్లియర్ చేస్తారు. అయితే ఈ సైరన్‌ను కొందరు వ్యక్తలు దుర్వినియోగం చేస్తున్నారు. మరికొందరు అనుమతి లేకుండా తమ వాహనాలకు సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు, వాహనాల సైరన్ మోతను వినసొంపుగా మార్చేందుకు కొత్త విధివిధానాలను రూపొందిస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
మహారాష్ట్ర(Maharashtra) ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్‌లతో కలిసి పుణెలోని చాందినీ చౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శబ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచడం ఎంతో ముఖ్యమన్నారు. వీఐపీ వాహనాలపై ఉండే రెడ్ బల్బ్‌ను గతంలో తమ ప్రభుత్వమే తొలిగించిందని ఇప్పుడు వీఐపీ వాహనాల్లో సైరన్‌ను కూడా తొలగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సైరన్‌కు బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా శబ్ద కాలుష్యం తగ్గుతుందని, సరైన్ మోత కాకుండా మంచి సంగీతాన్ని వినొచ్చని తెలిపారు.