»Supreme Court Directives In Ed Case Prime Minister Modi Is Behind Kavitha Cpi Narayana
CPI Narayana: కవిత వెనుక ఉంది ప్రధాని మోడీనే సీపీఐ నారాయణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవితా సెప్టెంబర్ 15న హాజరు కావల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. విచారణను వాయిదా వేస్తు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదీ ప్రధాని మోడి నడిపిస్తోన్న నాటకం అని సీపీఐ నారాయణ అన్నారు.
Supreme Court directives in ED case. Prime Minister Modi is behind Kavitha CPI Narayana
CPI Narayana: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో కేసులో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavith) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంతో విచారణ ముగిసిన తర్వాత మరొసారి సెప్టెంబర్ 15వ తేదీన హాజరు కావాలని ఈడీ(ED) నోటీసులు పంపించింది. ముఖ్యమైన పనుల దృష్ట్యా విచారణకు హాజరు కాలేదు. ఈడీ ఇచ్చిన సమన్లను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. సీపీఐ నారాయణ (CPI Narayana) విమర్శలు గుప్పించారు. విచారణకు రావాలని ఈడీ సమన్లు పంపిస్తే.. కవిత వీలు ఉన్నప్పుడు వెళ్లాలని కోర్టు చెప్పిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజీగా ఉన్నానని కవిత చెప్పగానే కోర్టు నమ్మిందని పేర్కొన్నారు. దీనంతటికి కారణం ప్రధాని మోడి అని విమర్షించారు.
ఈ స్కామ్లో ప్రధాన నిందుతులుగా ఉన్న మనిష్ సిసీడియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్, ఆరోరాలు అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. కవితను గతంలో మార్చి 16, 20, 21 తేదీల్లో విచారణకు పిలిచారు. ఆ సమయంలో కవితను సుధీర్ఘంగా విచారించారు. మరొసారి విచారణకు పిలవడంతో రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేగింది. వెంటనే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు కోర్టు కవితకు తాత్కాలిక ఊరటఇచ్చింది. దీనిపై విపక్షాలు మోడీపై విమర్షలు చేస్తున్నారు.