ఒకప్పుడు లవర్స్ (Lovers) ప్రైవసీ ఎక్కువగా కోరుకునేవారు. బహిరంగంగా కనీసం మాట్లాడుకోవడానికీ కూడా భయపడేవారు. ఆ తర్వత కాలంలో ఈ బిడియం తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్(Public)గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ (Romance) చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. నేరుగా చెట్టాపట్టాల్ వేసుకునే తిరిగే వరకు అయితే అందరూ చూశారు. కానీ, అంతకు మించి అన్నట్టుగా పట్టపగలు నడిరోడ్డుపై బైక్ పై రొమాన్స్ చేసుకోవడం బహుశా సినిమాల్లోనే చూసి ఉంటారు.
తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్(Jaipur)లో ఓ యువ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ.. ముద్దులతో (kissing) రెచ్చిపోయింది.యువకుడు బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ (Helmet) ధరించలేదు. పైగా రోడ్డువైపు చూడకుండా వెనుక కూర్చున్న అమ్మాయితో ముద్దుల్లో మునిగిపోయి కనిపించాడు. అటుగా వెళ్తున్న వాళ్లు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేశారు. ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై స్థానిక ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. బైక్ నంబర్ ఆధారంగా ఆ యువకుడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు