»Siddaramaiah Also Contest From Kolar Assembly Seat
Kolar నుంచి కూడా సిద్దరామయ్య పోటీ.. ఇవే చివరి ఎన్నికలు అంటూ
Siddaramaiah also contest from Kolar:కర్ణాటక అసెంబ్లీకి (karnataka assembly) నగారా మోగింది. మే 10వ (may 10th) తేదీన ఎన్నిక జరగనుంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య (Siddaramaiah) వరుణ (varuna) నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతోపాటు కోలార్ (kolar) నుంచి కూడా పోటీ చేస్తారట. గత ఎన్నికల పోటీ గురించి ఆయన వివరించారు.
Siddaramaiah to also contest from Kolar assembly seat
Siddaramaiah also contest from Kolar:కర్ణాటక అసెంబ్లీకి (karnataka assembly) నగారా మోగింది. మే 10వ (may 10th) తేదీన ఎన్నిక జరగనుంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య (Siddaramaiah) వరుణ (varuna) నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతోపాటు కోలార్ (kolar) నుంచి కూడా పోటీ చేస్తారట. గత ఎన్నికల పోటీ గురించి ఆయన వివరించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిద్దరామయ్య రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు. బదామీతోపాటు (badami) చాముండేశ్వరి (Chamundeshwari) నుంచి కూడా పోటీ చేశారు. చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుస్తానని అనుకోలేదని.. అయినా బరిలో నిలిచానని పేర్కొన్నారు. ఈ సారి తాను వరుణ నియోజకవర్గంలో తప్పకుండా గెలుస్తానని తెలిపారు.
కోలార్ (kolar) ప్రజలు తనపై చూపిన ప్రేమ, అభిమానం మరవలేనని సిద్దరామయ్య (Siddaramaiah) తెలిపారు. అందుకోసమే ఇక్కడినుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని వివరించారు. అందుకోసమే కోలార్ టికెట్ కూడా తనకు ఇవ్వమని హైకమాండ్‌ను కోరానని సిద్దరామయ్య (Siddaramaiah) తెలిపారు.
ఇవే చివరి ఎన్నికలు అని సిద్దరామయ్య (Siddaramaiah) ఇదివరకే ప్రకటించారు. వయోభారంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని పేర్కొన్నారు. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో.. కమలం సర్కార్‌ను ఏర్పాటు చేసింది. తొలుత యడియూరప్ప సీఎంగా పనిచేయగా.. ఆ తర్వాత బసవరాజు బొమ్మైని బీజేపీ హైకమాండ్ నియమించింది.