»Pakistan Ex Pm Imran Khan Posts Video Message For Supporters As Police Arrive To Arrest Him
Pakistan Ex-PM Imran Khan : అరెస్ట్ కి యత్నం… ఇంటి వద్ద ఉద్రిక్తత..!
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయడానికి పోలీసులు చుట్టుముట్టారు. తోషాఖానా కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ కేసులో ఆయనపై సుమారు 80 కి పైగా కేసులు ఉన్నాయి. వివిధ కోర్టుల్లో ఈ కేసులు ఉండటంతో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయడానికి పోలీసులు చుట్టుముట్టారు. తోషాఖానా కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ కేసులో ఆయనపై సుమారు 80 కి పైగా కేసులు ఉన్నాయి. వివిధ కోర్టుల్లో ఈ కేసులు ఉండటంతో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
అయితే… ఆయన అరెస్టును అడ్డుకునేందుకు ఆయన మద్దతుదారులు రంగంలోకి దిగడం గమనార్హం. దీంతో ఇరువైపులా పలువురికి గాయాలయ్యాయి. అంతకు ముందు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై పోలీసులు లాఠీలు, బాష్పవాయు గోళాలతో దాడి చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్ నుంచి పోలీసు బృందం రావడంతో పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయన ఇంటి ముందు గుమిగూడారు.
కాగా… పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే కేసులు, అరెస్టులు చేస్తున్నారని వీడియో రూపంలో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.