అలహాబాద్ హైకోర్టు మార్చి 22న ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 'యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004' రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని భారత్ మాతా చౌక్ సమీపంలోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఆవరణలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ ఉంచిన 1500 ట్రాన్స్‌ఫార్మర్లు కాలి బూడిదయ్యాయి.
భారతీయ జనతా పార్టీపై ఫిర్యాదు చేసినందుకు ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషికి ఎన్నికల సంఘం నోటీసు పంపింది. సోమవారంలోగా సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో మానవత్వం సిగ్గుపడేలా ఓ ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ గ్యాంగ్ రేప్ బాధిత విద్యార్థిని పాఠశాలలోకి ప్రవేశించేందుకు యాజమాన్యం అనుమతించలేదు.
ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి మరో శుభవార్త అందింది. నీటి సరఫరా సంబంధిత సంస్థకు చెల్లించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆర్థిక శాఖ)ని సుప్రీంకోర్టు కోరింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. న్యాయ్‌పత్ర-2024 పేరుతో 48 పేజీలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 5 న్యాయ పథకాలు, 25 గ్యారంటీలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు.
రాజకీయాల్లో పప్పు యాదవ్ గురించి అందరికీ తెలిసిందే. చాలాసార్లు లోక్‌సభకు ప్రాతినిద్యం వహించారు. అయిన తనకు టికెట్ దక్కలేదని ఏడ్చేశారు.
గత రాత్రి హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 5.3గా నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్‌లో మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కీలక ప్రకటన చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. జైల్లో ఉన్న ఆయన సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అలాగే సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
రాహుల్ గాంధీ ఆస్తులు గత ఐదేళ్లలో 28 శాతం మేర పెరుగుదలను నమోదు చేశాయి. ఆయన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ మేరకు వెల్లడించారు.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో బ్యాంకులకు 14 సెలవులు ఉంటాయి. అయితే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు తెరిచి ఉంటాయి. బ్యాంకులకు ఏప్రిల్ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం. రామ నవమి, నూతన సంవత్సరం వంటి పండుగలతో కలిపి ఈ నెలలో మొత్తం 14 సెలవులు ఉన్నాయి.
బాక్సర్ విజేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈరోజు పార్టీ నేతల సమక్షంలో విజేందర్ సింగ్ కండువా కప్పుకున్నారు.
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఆరోగ్య సమస్యల వల్ల ఎన్నికల ప్రక్రియలో భాగం కాలేకపోతున్నట్లు తెలిపారు.