ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్(Bastar)లో పెద్ద ప్రమాదం సంభవించింది. ఎన్నికల విధుల(Election Duty) నుంచి తిరిగి వస్తున్న సైనికులతో కూడిన బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది
తొలి దశలో భాగంగా మణిపూర్‌లో లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఓ 11 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుపుటకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఉచిత హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే అంశంపై చర్చ జరగాలని, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించడం మరిచిపోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ విజ్ఞప్తి చేశారు.
కర్నాటకలోని చిక్కబల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్యాక్స్ సిటీని కాంగ్రెస్ పార్టీ ట్యాంకర్ సిటీగా మార్చిందని ప్రధాని మోడీ అన్నారు.
మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షుగర్ వ్యాధి పై రాజకీయాలు వేడెక్కాయి. జైల్లో ఉన్న కేజ్రీవాల్ డైట్ చార్ట్‌పై బీజేపీ నిరంతరం దాడి చేస్తోంది.
బర్డ్ ఫ్లూ కోళ్లకు వస్తుందని అందరికీ తెలుసు. పక్షి జాతులకు వచ్చే ఈ వైరస్.. మనుషులకు సంక్రమించే అవకాశం ఉందని ఇప్పటి వరకు మనం విన్నాం. కానీ.. ఇప్పడు దీనిని పాలల్లోనూ ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదైంది.
గతంలో దూరదర్శన్ లోగో ఎరుపు రంగులో ఉండేది. అయితే ప్రస్తుతం దీనిని ఆరెంజ్ రంగుకు మార్చారు. దీంతో ఈ లోగోపై వివాదం చెలరేగుతున్నది.
మొదటి బిడ్డ ఆరోగ్యంగా ఉన్న వివాహిత జంటలను అద్దె గర్భం ద్వారా రెండో బిడ్డను కనకుండా నిరోధించే సరోగసీ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని స్పందన కోరింది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర ఇన్‌ఛార్జి కార్యదర్శి, తజిందర్ సింగ్ బిట్టు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
బెయిల్ కోసం కేజ్రీవాల్ ఉద్దేశ పూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తింటున్నారని ఈడీ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ మండిపడ్డారు. తన ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఘాటుగా స్పందించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అఫిడవిట్‌లో సొంతంగా కారు లేదని పేర్కొన్నారు. మొత్తం ఆయన ఆస్తి వివరాలను తెలిపారు.
వచ్చే రెండేళ్లలో అంటే 2026 కల్లా భారత్‌లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
దేశ వ్యాప్తంగా శుక్రవారం జరిగిన మొదటి విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓ రాష్ట్రంలో ఉన్న ఆరు జిల్లాల్లో మాత్రం జీరో పోలింగ్ నమోదై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి ఘటన నమోదు కావడం నాగాలాండ్ చరిత్రలో ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.