»Duvvuri Subbarao Former Rbi Governor Who Made Key Comments On Free Guarantees
Duvvuri Subbarao: ఉచిత హామీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఉచిత హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే అంశంపై చర్చ జరగాలని, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందన్నారు.
Duvvuri Subbarao: Former RBI Governor who made key comments on free guarantees
Duvvuri Subbarao: ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఉచిత హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే అంశంపై చర్చ జరగాలని, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. దీనికోసం ఓ శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని తెలిపారు. ఉచిత హామీలకు అయ్యే ఖర్చు, దానివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని అతను తెలిపారు.
దేశంలో అత్యంత బలహీనవర్గాలకు కొన్ని భద్రతలను కల్పించడం బాధ్యతని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రం కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం తప్పనిసరని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని తెలిపారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా 2047కి అవతరించాలంటే ఏటా 7.6 శాతం వృద్ధిరేటు నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధ చెందిన దేశానికి చట్టబద్ద పాలన, బలమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, పటిష్ఠ సంస్థలు నాలుగు స్తంభాల్లాంటివని దువ్వూరి వివరించారు. ఈ నాలుగు అంశాలు మనకే లేవు అనలేం. ఉన్నాయని అనలేమని తెలిపారు.