ఈ భూమి మీద తిరిగిన అతిపెద్ద పాము మన దేశంలోనిదే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2005లో దొరికిన అవశేషాలను బట్టి దానికి వాసుకి అనే పేరు కూడా పెట్టారు. అది గుజరాత్‌లో గుర్తించారు.
మణిపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనాలు పోలీంగ్ బూతుల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని ఇన్సిలిన్ ఇంజన్లు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు. తన డైట్ తదితర అంశాలపై ఈ రోజు కోర్టు విచారణ జరపనుంది.
చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన దేవుడైన శ్రీకృష్ణుడిని ఓ యువతి వివాహమాడింది. ఈ విచిత్రమైన ఘటన ఎక్కడ జరిగిందంటే..?
భారత క్రికెట్ జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు విగ్రహాన్ని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
భారత నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ హోదాలో ఉన్న అడ్మిరల్ ఆర్.హరి కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అతని స్థానంలో త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా రికార్డుకెక్కిన జ్యోతీ ఆమ్గే ఇవాళ జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతున్నది. ఈరోజు ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సాధారణ పౌరులతో పాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయనను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలనే డిమాండ్ ఉంది. దీని కోసం ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది.
దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం తొలి దశ ఓటింగ్‌తో ప్రారంభం కానున్నాయి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) స్వదేశీ ఇంజన్‌తో నిర్భయ్ ITCM క్రూయిజ్ క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించింది.
భారీ వర్షాల కారణంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలం అయ్యింది. 75 ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఎక్కడిక్కడ అన్ని స్తంభించిపోయాయి. అయితే అక్కడ చిక్కుకున్న భారత పౌరులు సాయం కోసం కాల్ చేయడానికి కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను తీసుకొచ్చింది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
ప్రేమ వైఫల్యం కారణంగా పురుషుడు తన జీవితాన్ని ముగించుకుంటే ఆ వ్యక్తి ఆత్మహత్యకు స్త్రీ బాధ్యత వహించదు. బలహీన మనస్తత్వం ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి మరొకరిని నిందించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆరోగ్య కారణాలు చూపించి ఈ కేసులో బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది.