»Navy Chief Vice Admiral Dinesh Tripathi As The Indian Navy Chief
Navy Chief: భారత నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
భారత నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ హోదాలో ఉన్న అడ్మిరల్ ఆర్.హరి కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అతని స్థానంలో త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు.
Navy Chief: Vice Admiral Dinesh Tripathi as the Indian Navy Chief
Navy Chief: భారత నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ హోదాలో ఉన్న అడ్మిరల్ ఆర్.హరి కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. త్రిపాఠి ప్రస్తుతం భారత నావికాదళ వైస్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 1964లో జన్మించిన త్రిపాఠి 1985లో భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో నిపుణుడిగా పేరుగాంచిన ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. వైస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు వెస్టర్న్ నావల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఐఎన్ఎస్ వినాశ్‌ను కమాండ్ చేసిన అనుభవం కూడా త్రిపాఠికి ఉంది.
వెస్టర్న్ ఫ్లీట్‌కు ఆపరేషన్స్ ఆఫీసర్, నావల్ ఆపరేషన్స్‌కు డైరెక్టర్, నెట్వర్క్ సెంట్రిక్ ఆపరేషన్స్‌కు ప్రధాన డైరెక్టర్, ఢిల్లీలో నావల్ ప్లాన్స్‌కు ప్రధాన డైరెక్టర్‌గా పనిచేశారు. ఈస్టర్న్ ఫ్లీట్‌లోనూ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా వ్యవహరించారు. ప్రఖ్యాత ఇండియన్ నావల్ అకాడమీకి కమాండంట్‌గా కూడా సేవలందించారు. రేవాలోని సైనిక్ స్కూల్, ఖడక్వాస్లాలోని ఎన్డీయే పూర్వ విద్యార్థి అయిన త్రిపాఠి నావల్ వార్ కాలేజ్ గోవాతో పాటు యూఎస్ఏలో కూడా వివిధ కోర్సులు పూర్తి చేశారు. అతి విశిష్ఠ్ సేవా మెడల్, నౌసేన మెడల్ పురస్కారాలను కూడా అందుకున్నారు.