నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ (PM MODI) ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ప్రధాని వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. 1,200 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా కొత్త పార్లమెంటును(Parliament) నిర్మిస్తున్నారు.
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని మంత్రి కేటీఆర్(KTR) కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా అనేక అంశాలను ఇవ్వకుండా దాటేశారని గుర్తు చేశారు. అలాంటి క్రమంలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వం..ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ వేదికగా KTR ఆరోపణలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings) అంటే ప్రజల సమస్యల గురించి చర్చించే వేదిక. అసెంబ్లీ అంటే ప్రజల రక్షణ కోసం..హక్కుల కోసం చట్టాలు చేసే అత్యంత బాధ్యతాయుతమైన సభ. అటువంటి సభలో బీజేపీ ఎమ్మెల్యే(Assembly meetings) ఎటువంటి బాధ్యత లేకుండా నిస్సిగ్గుగా అశ్లీల దృశ్యాలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ (MLA Jadab Lal Nath) పోర్న్ వీడియ...
హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక ఇడ్లీ(idlis) ప్రేమికుడు ఏడాది కాలంలో ఇడ్లీల కోసం కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మేరకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ(swiggy) గురువారం అతని వివరాలను వెల్లడించింది. అతను సగటును రోజుకు 23 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, స్నేహితులు, అతని కుటుంబ సభ్యుల కోసం చేసిన ఆర్డర్‌లతో సహా ...
PM Modi : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో మెట్ల బావి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా బాధకరమైన దుర్ఘటన. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడాను.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య (Sidda Ramaiah) ఆసక్తికం కామెంట్స్ చేశారు. తాను వంద శాతం సీఎం అభ్యర్థినేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తనతో పాటీ పడుతున్న డీకే శివకుమార్ (DK Sivakumar) తో తనకు ఎలాంటి విభేదాలు లేవని సిద్ద తెలిపారు. కర్ణాటక అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలయింది. మే 10న ఎన్నికలు జరగనుండగా... మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
Sri Rama Navami : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి రోజున విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో పెను ప్రమాదం జరిగింది. ఇక్కడి స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా భక్తులు మెట్ల బావిలో పడిపోయారు.
Lalit Modi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కొత్త తలనొప్పులు మొదలౌతున్నాయి. మోదీలపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పటికే దుమారం రేపాయి. ఈ కామెంట్స్ కారణంగానే ఆయన తన ఎంపీ పదవికి దూరం కావాల్సి వచ్చింది. తాజాగా.. ఆయనకు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ రూపంలో మరో సమస్య ఎదురైంది.
ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు లక్షల ఖరీదు చేసే ఇంజెక్షన్ పైన నిర్మల సీతారామన్ రూ.7 లక్షల జీఎస్టీని ఎత్తివేసి, ప్రాణాలు కాపాడారని, ఇందుకు ఆమెకు థ్యాంక్స్ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.
Kejrival : అసెంబ్లీలో తమ బలం చాటుకోవడానికి కేజ్రీవాల్ ఈ బలపరీక్ష తీర్మానానికి దిగారు. ఈ విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ తమ ప్రభుత్వంపై అవిశ్వాస ఓటును తీసుకురావాలని చూసిందని, అయితే ఇందుకు సరైన రీతిలో ఎమ్మెల్యేల బలాన్ని సంతరించుకోలేకపోయిందని కేజ్రీవాల్ చెప్పారు.
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న బస్సును స్కూటీ ఢీకొనడంతో ఆ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కూటీ పైన వెళ్తున్న వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
ప్రజలు మాస్కులు వినియోగించాలని.. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకోనివారు వెంటనే వేసుకోవాలని చెబుతున్నారు.
రాహుల్ గాంధీ అనర్హత పిటిషన్ పైన అమెరికా తర్వాత.. తాజాగా జర్మనీ స్పందించింది. ఆయనకు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉన్నదని అభిప్రాయపడింది.
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం వాటి ఆలనాపాలనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వాటి సంఖ్య పెరిగేందుకు అటవీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఓ చీతా నాలుగింటికి జన్మనివ్వడంతో భారత్ లో మళ్లీ చీతాల సంఖ్య పెరుగుతుందని అటవీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.