»Forget 2025 Bjp Wont Win Delhi Even In 2050 Arvind Kejriwal After Winning Confidence Vote In Assembly
Kejrival కామెంట్స్..! 2050లో కూడా బీజేపీ గెలవదు..
Kejrival : అసెంబ్లీలో తమ బలం చాటుకోవడానికి కేజ్రీవాల్ ఈ బలపరీక్ష తీర్మానానికి దిగారు. ఈ విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ తమ ప్రభుత్వంపై అవిశ్వాస ఓటును తీసుకురావాలని చూసిందని, అయితే ఇందుకు సరైన రీతిలో ఎమ్మెల్యేల బలాన్ని సంతరించుకోలేకపోయిందని కేజ్రీవాల్ చెప్పారు.
అసెంబ్లీలో తమ బలం చాటుకోవడానికి కేజ్రీవాల్ ఈ బలపరీక్ష తీర్మానానికి దిగారు. ఈ విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ తమ ప్రభుత్వంపై అవిశ్వాస ఓటును తీసుకురావాలని చూసిందని, అయితే ఇందుకు సరైన రీతిలో ఎమ్మెల్యేల బలాన్ని సంతరించుకోలేకపోయిందని కేజ్రీవాల్ చెప్పారు. అవిశ్వాస ఓటుకు వారికి 14 మంది ఎమ్మెల్యేల అవసరం అని, అయితే కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు.
ఢిల్లీలో ఎప్పటికైనా ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. 2025లో కాదు 2050లో కూడా ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాదన్నారు. అరెస్ట్ చేస్తామంటూ ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీప్రయత్నించిందన్నారు. సభలో తమకు మొత్తం 62 మంది సభ్యులు ఉన్నారని, వీరిలో సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇప్పుడు లేరని, సభలో ఉండే 56 మంది ఎమ్మెల్యేలను సిబిఐ, ఇడిల ద్వారా బెదిరించినా బీజేపీకి ఫలితం దక్కలేదని కేజ్రీవాల్ తెలిపారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అలా అని ఎప్పటికీ ఆయనే ఉండరు. ఎప్పుడైనా పదవి కోల్పోవచ్చు ఎప్పుడైతే మోదీ ప్రధానిగా దిగిపోతారో అప్పుడు ఈ దేశం అవినీతి విముక్తి భారత్ అవుతుందని అన్నారు.