బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేతిలో దేశంలోని అన్నీ వ్యవస్థలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ ఆ దేవుడిని కూడా మాయ చేస్తారని సెటైర్లు వేశారు.
పూంచ్ సెక్టార్ వద్ద నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భారత సైన్యం అడ్డుకోగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఓ భారత సైనికుడు గాయపడగా.. తర్వాత టెర్రరిస్ట్స్ లొంగిపోయారు. వారి నుంచి 10 కిలోల ఐఈడీ పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వదేశీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ 'ధృవ్'('Dhruv') ఇప్పుడు మళ్లీ ఎగురుతుంది. ప్రత్యేక మిషన్లలో కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్(Helicopter)ను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడింది. ఒక నెల క్రితం సైన్యం దాని ప్రయాణాన్ని నిషేధించింది.
కదులుతున్న కారుపైన పుషప్స్ చేస్తూ అత్యంత దుస్సాహసానికి ఒడిగట్టారు. దీంతోపాటు కారు ముందు అద్దాలపై నుంచి బయటకు వచ్చి ప్రమాదకరంగా ప్రయాణం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి వెర్రికి పోలీసులు బుద్ధి చెప్పారు.
అసలు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు రెజ్లర్లపై నోరు మెదిపేందుకు జంకుతున్నారు. ఇదే విషయాన్ని ఓ కేంద్ర మంత్రిని మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పరుగు పెట్టారు. ఎక్కడ ఆగకుండా పరుగు పరుగున తన కారు వద్దకు వెళ్లారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు(K Chandrasekhar Rao) తమ పార్టీ భారత రాష్ట్ర సమితి(BRS)ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల(assembly elections)ను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ ఇక్కడ మార్గాలను అన్వేషిస్తోంది.
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ AJIO జూన్ 1, 2023 నుంచి ప్రారంభం కానున్న తన 'బిగ్ బోల్డ్ సేల్'ని ప్రకటించింది. ఈ మెగా సేల్ కోసం వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.
31 మే 2023న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం(anti tobacco day). ఈ సంవత్సరం 2023 థీమ్(theme) “మనకు ఆహారం కావాలి, పొగాకు కాదు”. దీంతోపాటు పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తి, మార్కెటింగ్ అవకాశాల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యం. పొగాకు వ్యతిరేక దినోత్సవం ద్వారా వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలకు పొగాకు వినాశకరమైన ప్రభావం గురించి గుర్తుచేయనున్నారు.
ఘాట్ రోడ్డు(Tirumala Ghaat Road)లో వాహనాల పర్యవేక్షణకు పోలీస్, విజిలెన్స్ , ట్రాన్స్ పోర్టు విభాగాలతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ(TTD) తెలిపింది. మరో వైపు 12 ఏళ్లకు పైబడిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని ప్రకటించింది.