»Our Struggle Is Protect Nation Says Congresss Pawan Khera
Congress’s Pawan Khera:దేశాన్ని కాపాడటం కోసమే పోరాటం: కాంగ్రెస్ పవన్ ఖేరా
Congress's Pawan Khera:ప్రధాని మోడీపై (modi) అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను (Pawan Khera) అసోం పోలీసులు (police) ఢిల్లీలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును (supreme court) ఆశ్రయించింది. పవన్ ఖేరాకు (pawan khera) సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ద్వారకా కోర్టుకు స్పష్టంచేసింది.
Our struggle is protect nation, says Congress's Pawan Khera
Congress’s Pawan Khera:ప్రధాని మోడీపై (modi) అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను (Pawan Khera) అసోం పోలీసులు (police) ఢిల్లీలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును (supreme court) ఆశ్రయించింది. పవన్ ఖేరాకు (pawan khera) సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ద్వారకా కోర్టుకు స్పష్టంచేసింది. రూ.30 వేల పూచీకత్తు ఇవ్వడంతో పవన్ ఖేరా జైలు నుంచి విడుదల అయ్యారు.
దేశాన్ని, రాజ్యాంగ విలువలను రక్షించడానికి తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని పవన్ ఖేరా (Pawan Khera) అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు నోటీసు ఇవ్వకుండా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా విమానం నుంచి బలవంతంగా దించారని తెలిపారు. ఎయిర్ పోర్టులోనే (air port) అసోం పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించానని తెలిపారు.
రాయ్పూర్ (raipur) వెళుతుండగా విమానం నుంచి కిందకి దించి ఖేరాను అరెస్ట్ చేశారని సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి (abhishek) కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఖేరాపై ఫైల్ చేసిన అన్ని కేసులను కలిపి విచారించాలని ఆయన కోరారు. పవన్ ఖేరాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని.. దేశవ్యాప్తంగా వివిధ చోట్ల దాఖలైన ఎఫ్ఐఆర్లను కలుపాలని కోరారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అయితే పవన్ ఖేరా పొరపాటున నోరు జారారని.. క్షమించాలని కోరారని సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పవన్ ఖేరాను అరెస్ట్ చేశారని.. ట్రాన్సిట్ రిమాండ్ కోసం కోర్టు ఎదుట ప్రవేశపెట్టాల్సి ఉందని అసోం పోలీసుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.