»Impressive Robotics Gallery The Robot That Served Chai To Modi
PM Modi: ఆకట్టుకుంటోన్న రోబోటిక్స్ గ్యాలరీ..మోదీకి చాయ్ సర్వ్ చేసిన రోబో!
ప్రధాని మోదీకి ఓ రోబో చాయ్ సర్వ్ చేసింది. గుజరాత్ సైన్స్ సిటీలో రోబోలు చేసే పనులకు మోదీ ముగ్ధుడయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోబోటిక్స్ గ్యాలరీలోని ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఇండియాలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రధాని మోదీ గుజరాత్లో పర్యటిస్తుండగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీకి ఓ రోబో చాయ్ అందించడం అందర్నీ ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోదీకి రోబో చాయ అందించిన ఘటన అహ్మదాబాద్ లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్లో చోటుచేసుకోవడం విశేషం. ఈ వైబ్రాంట్ సమ్మిట్లో ప్రధాని మోదీ రోబోటిక్స్ గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి చాయ్ ఇచ్చింది.
గుజరాత్ సైన్స్ సిటీలోని రోబోటిక్స్ గ్యాలరీ:
Spent a part of the morning exploring the fascinating attractions at Gujarat Science City.
Began with the Robotics Gallery, where the immense potential of robotics is brilliantly showcased.
Delighted to witness how these technologies igniting curiosity among the youth. pic.twitter.com/ZA9XY1qWMN
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..గుజరాత్ సైన్స్ సిటీలో రోబోటిక్స్ గ్యాలరీ ఎంతగానో ఆకట్టుకుందని మోదీ అన్నారు. రోబో తనకు చాయ్ ఇచ్చిన ఫోటోను అస్సలు మిస్ కావొద్దంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ ఫోటోలను, వీడియోలను నెట్టింట షేర్ చేశారు. ఇది కొత్త శకానికి నాంది అని అన్నారు. రాబోవు రోబో యుగంలో భారత్ మరిన్ని ప్రయోగాలతో దూసుకుపోతుందన్నారు.
ఆకట్టుకుంటున్న రోబోటిక్స్ గ్యాలరీ:
Also enjoyed a cup of tea served by Robots at the cafe in the Robotics Gallery. pic.twitter.com/hfk5aDSuoT