»Governor Vs Dmk Government In Tamil Nadu Senthil Balaji Is Out From The Cabinet
Senthil Balaji: తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే సర్కార్..మంత్రివర్గం నుంచి సెంథిల్ బాలాజీ ఔట్!
తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్.రవి అనూహ్య చర్య వల్ల స్టాలిన్ సర్కార్ తో పాటు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి వర్గం నుంచి సెంథిల్ బాలాజీని తొలగించడంపై గవర్నర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
తమిళనాడు(Tamilnadu)లో గవర్నర్(Governer)కు డీఎంకే(DMK) ప్రభుత్వానికి అస్సలు పట్డడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దానికి తోడు గవర్నర్ చేసిన పని ఇప్పుడు మరింత రెచ్చగొట్టేలా ఉంది. తమిళనాడు మంత్రి వర్గం నుంచి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)ని గవర్నర్ ఆర్ఎన్.రవి(Governer RN.Ravi) అనూహ్యంగా తొలగించారు. దానికి సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేయడంతో మరో కొత్త వివాదం నలెకొంది. అయితే అటార్నీ జనరల్‌తో సంప్రదింపుల కోసమేనంటూ గవర్నర్ ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు.
అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మంది వద్ద నగదు తీసుకున్నట్లు మంత్రి సెంథిల్ బాలాజీపై కేసు ఉంది. ఈ తరుణంలో గతంలో ఈడీ అధికారులు కూడా ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ప్రస్తుతం ఆయనపై పలు నేరాలతో సంబంధం కూడా ఉంది. దీంతో కోర్టు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది.
కోర్టు సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి కస్టడీ విధించడంతో ఆయనపై ఎటువంటి శాఖ లేని మంత్రి మండలి నుంచి తొలగిస్తూ గవర్నర్(Governer RN.Ravi) ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ నుంచి కూడా ప్రకటన వెలువడింది. చివరికి అటార్నీ జనరల్‌తో ఈ అంశాన్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు నిలిపివేసినట్లు గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సీఎం స్టాలిన్‌కు కూడా ఈ విషయాన్ని తెలిపాయి.
గవర్నర్ తీసుకున్న ఈ చర్యపై సీఎం ఎం.కె.స్టాలిన్(Cm Stalin) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంత్రిని కేబినెట్ నుంచి తొలగించే అధికారం గవర్నర్(Governer RN.Ravi)కు లేని తెలిపారు. ఇటువంటి అంశాన్ని తమ సర్కార్ న్యాయపరంగా ఎదుర్కొంటుందని వెల్లడించారు. మంత్రిని తొలగించడాన్ని ప్రతిపక్షాలు కూడా ఖండించడంతో తమిళనాడు రాజకీయాలు మరింత హీటెక్కాయి. గవర్నర్ చర్యను ప్రతిపక్షాలు విమర్శించాయి. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యాన్ని హతమార్చడమేనని తెలిపాయి.