EVM: ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా.. వంద శాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 01:18 PM IST

EVM: లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా.. వంద శాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును జస్డిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం వెలువరించింది. అలాగే ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్‌ను సీల్ చేయాలని తెలిపింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలని తెలిపింది.

ఇది కూడా చూడండి: polls : రెండో విడత అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థి ఎవరంటే..?

అయితే ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని తెలిపింది. ఇంజినీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని తెలిపింది. ఈ వెరిఫికేషన్‌కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని తెలిపింది. అలాగే కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్‌లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్‌ను ఉపయోగించాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: Cow Milk vs Buffalo Milk: ఆవు పాలు లేదా గేదె పాలలో ఏది మంచిది..?

Related News

Supreme Court : యాసిడ్ దాడి బాధితుల కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

యాసిడ్ దాడిలో ప్రాణాలతో బయటపడిన తొమ్మిది మంది పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ తొమ్మిది మంది పిటిషనర్ల డిజిటల్ కేవైసీ డిమాండ్‌పై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.