దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణ శాఖ (ఐఎండీ) వెదర్ బులెటిన్ విడుదల చేసింది. గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
Yellow Alert: దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని
భారతవాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస్తాయని ఆదివారం ఐఎండీ సంస్థ తన బులిటెన్ లో పేర్కోంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జులై 6వతేదీ వరకు భారీ వర్షాలకు(Heavy Rainfall) అవకాశముందని ఐఎండీ ఎల్లో అలర్ట్ (yellow alert) జారీతో హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అలాగే సహాయక సిబ్బంది కూడా అలెర్ట్ గా ఉండాలని సూచించింది.
నైరుతి రుతుపవనాల(Southwest Monsoon) ప్రభావంతో గుజరాత్ రాష్ట్రంలో సోమవారం(Monday) వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) బలపడితే భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rainfall) కురిసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే గుజరాత్ లోని కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్కడి ప్రజల జీవనానికి కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక రుతుపవనాలు బలపడితే వీరి పరిస్థితి మరీ అద్వానంగా ఉంటుందని, ఈ లోతట్టు ప్రాంతాల వారిని వెంటనే అప్రమత్తం చేయాల్సిన పని ఎంతైన ఉందని తెలుస్తుంది. అలాగే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోవు 24 గంటలపాటు ఏకదాటిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 5వతేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy Rainfall) కురిసే అవకాశాలు ఉన్నాయి. గోవా, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అలాగే దక్షాణాది రాష్ట్రాలు అయిన కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) అధికారులు తెలిపారు.