»Draupadimurmus Disgrace Is A Proof Of Dictators Rule Minister Sitakka
Minister Sitakka: ద్రౌపదిముర్ముకు ఘోర అవమానం.. నియంత పాలనకు నిదర్శనం
మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణీకి భారతరత్న పురస్కారాన్ని అందించడం కోసం ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము స్వయంగా వారి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఓ పరిణామంపై తెలంగాణ మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. ఇది గిరిజన బిడ్డకు జరిగిన అవమానం, నియంత పాలనకు నిదర్శనం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Draupadimurmu's disgrace is a proof of dictator's rule... Minister Sitakka
Minister Sitakka: బీజేపీ అగ్రనేత, రాజకీయ కురవృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించిన విషయం తెలిసిందే. శనివారం ఈ పురస్కరాలను అందించారు. వయోభారం కారణంగా అద్వాణీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadimurmu), ప్రధాని నరేంద్ర మోడీ(PMModi) స్వయంగా అద్వాణీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేశారు. వీరితో పాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెళ్లారు. వారి కుటుంబ సమక్షంలో అత్యున్నత పురస్కారాన్ని అద్వాణీకి అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. దానిపై తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రి సీతక్క విమర్శించారు.
అవార్డు ప్రదానం చేసిన ఫోటోలో ప్రధాని మోడీ, అద్వాణీ కుర్చీలపై కూర్చొని ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలబడి ఉన్నారు. ఈ ఫొటోను సీతక్క తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. “భారతదేశంలో నియంత పాలనకు ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. ఓ ఆదివాసీ మహిళకు జరిగిన ఈ ఘోర అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను” అని రాసుకొచ్చారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ‘ప్రధాని మోదీ గారు.. ఆదివాసీ అంటే చులకనా? రాష్ట్రపతి పదవి అంటే చులకనా? లేక ప్రజాస్వామ్యం అంటేనే చులకనా?’ అని ఎక్స్‌లో ఖాతాలో ప్రశ్నించింది. వయోభారంతో అద్వాణీ కూర్చొవచ్చు కానీ ప్రధాని కూర్చోవడం బాగాలేదని, అది దేశ ప్రథమపౌరురాలు రాష్ట్రపతి నిల్చొని ఉండడం అసలు బాగాలేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.