»Dead Bodies Of Five People Found From The Same House In Kerala Drugs Found In Childrens Bodies
Kerala: కేరళలో ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
కేరళలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియరాలేదు. కన్నూర్‌లో బుధవారం ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.
Kerala: కేరళలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య(Sucide) చేసుకున్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియరాలేదు. కన్నూర్(Kannur)లో బుధవారం ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి. ఈ మృతదేహాలన్నీ ఇంట్లో కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఇందులో ఇద్దరు ఉరికి వేలాడుతూ కనిపించగా.. ముగ్గురు భవనంలోని మెట్లపై కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు. పోస్టుమార్టం నివేదికలో ముగ్గురు చిన్నారుల మృతదేహాల్లో రసాయనాలు(chemicals) తీసుకున్నట్లు తేలింది. పోలీసుల ప్రాథమిక విచారణలో చిన్నారులు నిద్రమాత్రలు మింగి మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా.. శరీరంలో దొరికిన పదార్థం విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడానికి శరీరంలోని అంతర్గత అవయవాలను పరీక్షించాలని నిర్ణయించారు. మృతులను షాజీ (42), భార్య శ్రీజ (38), శ్రీజ పిల్లలు సూరజ్ (12), సుజిన్ (8), సుర్భి (6)గా గుర్తించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం శ్రీజకు షాజీ రెండో భర్త. శ్రీజ బుధవారం ఉదయం 6 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి పిల్లలను చంపేస్తానని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే వారందరూ చనిపోయినారు. అయితే వెంటనే వైద్యులను పిలిపించగా వారు వచ్చి పరీక్షించి అందరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్ద కొడుకు సూరజ్ శరీరంపై తీవ్ర గాయాలైన ఆనవాళ్లు ఉన్నాయి. శ్రీజకు షాజీ రెండో భర్త. చిన్న పిల్లల పట్ల వారు ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో తెలియలేదు. షాజీ, శ్రీజ ఒకే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారు.