Congress used Northeast as ATM:ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా వాడుకుంది, కాంగ్రెస్‌పై మోడీ ఫైర్
Congress used Northeast as ATM:కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి నాగాలాండ్‌ను రిమోట్ కంట్రోల్‌తో నడిపించిందని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. ఈ నెల 27వ తేదీన నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Congress used Northeast as ATM:కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ (modi) ఫైర్ అయ్యారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి నాగాలాండ్‌ను రిమోట్ కంట్రోల్‌తో నడిపించిందని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. ఈ నెల 27వ తేదీన నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. శుక్రవారం చుమోకెదిమా జిల్లాలో బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ (modi) పాల్గొన్నారు.
కాంగ్రెస్ (congress) హయాంలో నాగాలాండ్‌లో రాజకీయ అస్థిరత ఉండేదని గుర్తుచేశారు. ఢిల్లీ (delhi) నుంచి దిమాపూర్ వరకు వారసత్వ రాజకీయాలు నిర్వహించేవారని ఫైరయ్యారు. అభివృద్ధి కోసం ఉద్దేశించిన నిధులను కాజేశారని ఆరోపించారు. ప్రశాంతత, అభివృద్ధి, శ్రేయస్సు అనేవి నాగాలాండ్‌కు సంబంధించి బీజేపీ పాటించే మంత్రాలు అని పేర్కొన్నారు. అందుకే బీజేపీ పట్ల నాగాలాండ్ ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. నాగాలాండ్‌లో శాశ్వత శాంతి స్థాపనకు ఎన్డీయే సర్కారు కృషి చేస్తోందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో సాయుధ దళాల చట్టం (ప్రత్యేక అధికారాలు) 1958ని పూర్తిగా ఎత్తేసినట్టు ప్రకటించారు.
టెక్నాలజీ సాయంతో ఈశాన్య ప్రాంతంలో అవినీతిని బీజేపీ కట్టడి చేసింది. కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో ప్రజలు నేరుగా తమ బ్యాంకు ఖాతాలకు నిధులు పొందుతున్నారని ప్రధాని మోడీ (modi) తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నాగాలాండ్‌లో రాజకీయ అస్థిరత ఉండేదని చెప్పారు. అంతకుముందు నాగాలాండ్ సీఎం రియో ప్రధాని మోడీకి నాగాలాండ్ సంస్కృతికి ప్రతిబింబించే డోలును బహుకరించారు.
Nagaland CM Neiphiu Rio felicitates PM Narendra Modi ahead of his public address, in Dimapur pic.twitter.com/fIs2IxvzRQ
కాంగ్రెస్ నేతలు నాగాలాండ్ వైపు చూడలేదని.. ఆ రాష్ట్ర ప్రయోజనం కోసం పాటుపడలేదని చెప్పారు. ఈ రోజు వేలాది మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఈశాన్య రాష్ట్రాలను తాము చూడటం లేదని చెప్పారు. అవీ తమకు అష్టలక్ష్మీ అని పేర్కొన్నారు.