»Class 9 Girl Student Dies Due To Sudden Heart Attack In Amreli
Heart Attack: పరీక్షా హాలులోనే గుండెపోటుతో చనిపోయిన 9వ తరగతి విద్యార్థిని
ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వృద్ధులకే గుండెజబ్బులు వస్తాయని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండె పోటు వస్తుంది.
Heart Attack: ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వృద్ధులకే గుండెజబ్బులు వస్తాయని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండె పోటు వస్తుంది. బడి పిల్లల నుంచి 30 ఏళ్లలోపు వారు సైతం గుండె పోటుతో చనిపోతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న వారికి గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా అవయవాలు ఆగిపోతున్నాయి. కాగా, ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో 9వ తరగతి చదువుతున్న బాలిక గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపుతోంది. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థికి గుండెపోటు రావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. రాష్ట్రంలోని అమ్రేలి నగరంలో 9వ తరగతి చదువుతున్న బాలిక పరీక్ష హాలులోనే కుప్పకూలింది. మృతి చెందిన విద్యార్థిని రాజ్‌కోట్ జిల్లా జస్తాన్ తాలూకాకు చెందిన సాక్ష్ రాజోసరగా గుర్తించారు. నిన్న ఉదయం సంతబ గజేరా పాఠశాలలో చదువుతున్న బాలిక పరీక్ష హాలులోకి ప్రవేశిస్తుండగా కిందపడిపోయింది. బాలికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.
సూరత్ జిల్లాలో మరో వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దర్జీ వృత్తిలో పని చేస్తున్న వసంత్ భాయ్ చౌదరి (50) ఛాతీ నొప్పికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందాడు. అతను ఉమర్పాడు వాడి గ్రామ నివాసి. గతంలో సూరత్‌లో నవరాత్రుల సందర్భంగా గర్బా సమయంలో మరణాలు కూడా నమోదయ్యాయి. కోవిడ్-19 తర్వాత యువతలో గుండెపోటులు పెరిగాయి. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా కరోనా వైరస్-గుండెపోటు సంబంధాల గురించి ప్రస్తావించారు. తీవ్రమైన కోవిడ్ -19 ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తులు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు ఎక్కువ శ్రమించకూడదని సూచించారు.