రాహుల్ గాంధీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ కలకలం రేపింది. రాహుల్ గాంధీ… ప్రస్తుతం జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా…భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌కు చేరుకోకముందే ఇండోర్‌లో రాహుల్ గాంధీకి అజ్ఞాత బెదిరింపు రావడంతో కలకలం రేగింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు రాగానే బాంబు పేలుస్తామని కాంగ్రెస్ నేతను బెదిరించారు. రాహుల్ గాంధీని చంపేస్తానని లేఖలో బెదిరించారు. ఈ విషయంపై పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లేఖ లభ్యమైన స్వీట్స్ దుకాణం సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, ఇది ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ‘‘ఇండోర్ నగరంలోని పలు చోట్ల బాంబు పేలుళ్లుకు పాల్పడి.. కమల్ నాథ్‌ను కాల్చి చంపుతాం.. నిన్ను (రాహుల్ గాంధీ) మీ తండ్రి రాజీవ్ గాంధీ దగ్గరకు పంపిస్తాం’’ అని ఆ లేఖలో రాసినట్టు పోలీసులు పేర్కొన్నారు.