»Bjp Strongly Accuses Kejriwal Behind The Disappearance Of Jharkhand Cm Hemant Soren
Hemant Soren: సోరెన్ అదృశ్యం వెనుక కేజ్రీవాల్.. బీజేపీ తీవ్ర ఆరోపణలు
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొన్ని గంటలు కనిపించకుండా పోవడం వెనుక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాస్తం ఉందని బీజేపీ పార్టీ నేత నిశికాంత్ దూబే ఆరోపించారు.
BJP strongly accuses Kejriwal behind the disappearance of Jharkhand CM Hemant Soren.
Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren) అజ్ఙాతంలోకి వెళ్లాడని జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. భూకుంభకోణం, మనీల్యాండరింగ్ కేసులో సీఎం సోరెన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేడు. అధికారులు సాయంత్రం వరకు వేచి చూశారు అయిన ఫలితం లేదు. సోదాలు నిర్వహించిన అధికారులు రెండు కార్లు, కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఝార్ఖండ్ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. అనంతరం సోరెన్ రాంచీకి చేరుకున్నారు.
ఢిల్లీ నుంచి సోరెన్ రాంచీ చేరుకోవడంలో ఆమ్ ఆద్మీ చీఫ్, సీఎం కేజ్రీవాల్ హస్తం ఉందని బీజేపీ నేత నిశికాంత్ దూబే ఆరోపించారు. రాంచీకి చేరుకున్న సోరెన్ సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. భూ కుంభకోణం, మనీల్యాండరింగ్ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నహేమంత్ సోరెన్ ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకోవడంలో ఆప్ మంత్రి సాయం చేశాడని, ఇదంత కేజ్రీవాల్ కనుసన్నల్లోనే జరిగిందని నిశికాంత్ దూబే తన ఎక్స్ ఖాతా వేదికగా ఆరోపించారు. సోరెన్ ఏర్పాటు చేసిన సమావేశానికి 35 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని, తన భార్య కల్పనా సోరెన్‌కు సీఎం చేయాలన్న ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరలేదని నిశాంత్ రాసుకొచ్చారు.