»Birthday Celebrations Of Madhya Pradesh Congress Mla Babu Jandel With A Snake Around His Neck
MLA Birthday: పామును మెడలో వేసుకుని ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు
ప్రజాప్రతినిధులు పుట్టిన రోజుల వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో అందరికి తెలిసిందే. అయితే ఈ ఎమ్మేల్యే మాత్రం అందుకు భిన్నంగా జరుపుకున్నారు. పామును మెడలో వేసుకొని తన బర్త్‌డేను జరుపుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
MLA Birthday: మాములుగా ఎమ్మెలేలు తమ పుట్టిన రోజు(Birthday) వేడుకలను ఎలా జరుపుకుంటారో అందిరికి తెలిసిందే. ప్రజల నడుమ గజమాలలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాంటిది ఒక ఎమ్మెల్యే(MLA) తన బర్త్‌డే వేడుకలను వినుత్నంగా జరుపుకున్నారు. పూల దండలకు బదులు పామును(Snake) మెడలో వేసుకొన్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని షియోపూర్‌లో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్(Babu jandel) శుక్రవారం తన బర్త్ డేను విచిత్రంగా జరుపుకున్నారు. ఆయన అభిమానులు ఇచ్చిన పూల దండలను నిరాకరించారు. వాటిని తిరిగి వారికే ఇచ్చేశారు. అనంతరం పాములు ఆడించే వ్యక్తికి చెందిన బుట్టలో ఉన్న పామును తీసుకుని మెడలో వేసుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
కాగా, తన పుట్టిన రోజును చాలా సింపుల్‌గా జరుపుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్ తెలిపారు. జంతువులు తన స్నేహితుల్లాంటివని చెప్పారు. తన పెరట్లో జాస్మిన్ చెట్టు ఉన్నదని, తరచుగా పాములు వస్తుంటాయని అన్నారు. తాను శివ భక్తుడినని అందుకే శివుడి ప్రతిరూపమైన పామును మెడలో వేసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
శివుని మెడలో నాగుపాము ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తాజాగా శివుని విగ్రహం మెడపై నిజమైన నాగుపాము చుట్టుకొని స్థానికులను ఆశ్చర్యపరిచింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పరమేశ్వరుడి విగ్రహానికి పాము చుట్టుకుంది.