బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్‌గంజ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. జాతీయ రహదారి 327 పై వేగంగా వచ్చిన స్కార్పియో, డంపర్ ఢీకొన్న సంఘటన జిల్లాలోని పౌఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్‌గంజ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. జాతీయ రహదారి 327 పై వేగంగా వచ్చిన స్కార్పియో, డంపర్ ఢీకొన్న సంఘటన జిల్లాలోని పౌఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో స్కార్పియో నుజ్జనుజ్జు అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో నలుగురు మహిళలు, ఓ వ్యక్తి, స్కార్పియో డ్రైవర్ మృతి చెందారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, కిషన్‌గంజ్ ఎంజీఎం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సిలిగురి వైపు వెళ్తుండగా ప్రమాదం
మృతులు సిలిగురి వైపు వెళ్తున్న అరారియా జిల్లాలోని జోకిహాట్ వాసులు అని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. స్కార్పియోలో ఇరుక్కున్న డ్రైవర్‌ను కష్టపడి బయటకు తీశారు. ఈ ఘటనపై నగరపంచాయతీ ప్రెసిడెంట్ ప్రతినిధి అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్డిపిఓ మంగ్లేష్ కుమార్ సింగ్, ఇతర అధికారులు చేరుకుని తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. మృతులు జోకిహట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహదేవ నివాసి షహబుద్దీన్ కుమారుడు స్కార్పియో డ్రైవర్ ఎండీ ఇర్షాద్ (30), ఆర్టియాలో నివాసముంటున్న అబ్సర్ కుమారుడు ఎండీ ఇర్షాద్ (30)గా గుర్తించారు. మో ఖుర్షీద్ భార్య బగ్మారా నివాసి అఫ్ఫాన్ (4), గుల్షన్ అరా (27), తప్కోల్ నివాసి ముజాహిద్ భార్య గుడియా బేగం (13), బగ్మారా నివాసి అయాన్ (8).