రూ.2వేల నోటు మార్పిడికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2 వేల కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది. కరెన్సీ నోట్ల(Currency notes)ను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ (Deposit) చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆర్బీఐ విధించిన డెడ్లైన్ మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది. ఈ క్రమంలోనే ఎవరైన తమ వద్ద ఇంకా రూ.2వేల నోట్లు ఉంటే మార్చుకుంటే మంచిది.కాగా, ఈ నోట్ల మార్చుకునేందుకు 5 రోజులే సమయం ఉండగా.. అందులో ఒకరోజు దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంది.సెప్టెంబర్ 25 నుంచి 27 వరకూ (సోమవారం నుంచి బుధవారం) బ్యాంకులు యథావిథిగా పనిచేయనున్నాయి.
ఇక 28వ తేదీన గురువారం నాడు బ్యాంకులకు సెలవు. అనంతరం 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి. ఈ నాలుగు రోజుల్లోనే మీ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు వీలు ఉంటుంది. అందుకని వినియోగదారులు(Users)బ్యాంకు పనివేళలను తెలుసుకొని 2వేల రూపాయల నోట్లతో వెళ్తే మంచిది. మరోవైపు పెద్ద నోట్ల మార్పిడికి పెట్టిన డెడ్లైన్(Deadline)ను ఆర్బీఐ పొడగించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పెర్కోన్నాయి.సెప్టెంబరు చివర్లో సెలవుల నేపథ్యంలో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఇంకో రెండువారాల గడువు ఇచ్చే అవకావం ఉందని అంచాన వేస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఆర్బీఐ ‘క్లీన్ నోట్ ‘పాలసీ'(Clean Note ‘Policy) ప్రకారం భారతదేశంలో రూ.2,000 నోటు, సెప్టెంబర్ 30 తర్వాత చట్టబద్ధమైన టెండర్ హోదాను కోల్పోతుంది.