Kinjarapu Atchannaidu: స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ జైలులో ఉండగా.. కుమారుడు నారా లోకేశ్ ఢిల్లీలో ఉన్నారు. నెక్ట్స్ అరెస్ట్ లోకేశ్ అని.. భయపడి హస్తినలో నక్కారని వైసీపీ నేతలు, మంత్రి రోజా కామెంట్స్ చేశారు. లోకేశ్ ఏపీకి ఎప్పుడొస్తావ్ అని మంత్రి రోజా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) స్పందించారు. జైలులో ఉన్న చంద్రబాబును ములాఖత్ సమయంలో కలిశారు. ఆ తర్వాత మీడియతో మాట్లాడారు.
తప్పు చేయలేదని, ఎవరికీ భయపడబోమని అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. కొందరు అవివేకులు మాత్రమే అరెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తారని విరుచుకుపడ్డారు. తండ్రి జైలులో ఉంటే బయటకు తీసుకొచ్చేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని వివరించారు. అక్కడ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని వివరించారు. ఏపీలో జరుగుతున్న తీరును ఢిల్లీలో ఇతర రాజకీయ పార్టీ నేతలకు చెబుతున్నారని తెలిపారు. అంతే తప్ప మరో ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. త్వరలో యువగళం పాదయాత్ర ప్రారంభం అవుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి తీసుకున్న తర్వాత ప్రారంభిస్తామని చెప్పారు.