కర్ణాటక రాష్ట్రం(Karnataka State)లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ చిరుత పులి (Cheetah) గ్రామంలోకి ప్రవేశించింది. వేగంగా పరుగెత్తే క్రమంలో ఓ బావి (Bavi) లో పడిపోయింది. దీన్ని గ్రామస్థులు కనిపెట్టారు. దాన్ని బయటకు రప్పించాలంటే అటవీ అధికారుల(Forest officials)కు సాధ్యమే. వారు మత్తు మందు ఇచ్చి దాన్ని పట్టేసుకోవచ్చు. గ్రామస్థులు(Villagers)పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బందో లేక పోలీసులో తెలియదు కానీ, ఎవరో ఒకరు వచ్చినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. వారి దగ్గర చిరుత పులికి మత్తు మందు ఇచ్చే ఎక్విప్ మెంట్ (Equipment) లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. బావిలోకి ఓ నిచ్చెన విడిచి పెట్టారు. దాని సాయంతో చిరుత పైకి వస్తుందేమోనని చూశారు. కానీ పైన జనాలు ఉండేసరికి ప్రాణభయంతో అది బయటకు రావడం లేదు.
దీంతో ఓ పొడవాటి కర్రకు చివర్లో గుడ్డ చుట్టి దానికి మంట అంటించారు. ఆ కర్రను కిందకు పంపించి చిరుత పులిని బెదిరించారు. దీంతో అది అక్కడి నుంచి నిచ్చెన ఎక్కి బయటకు వచ్చింది. బావి మీద నుంచి గోడమీదకు దూకేసి, ఆ తర్వాత మైదానం(field)లో పరుగున పారిపోయింది. ఈ వీడియోని సహానా సింగ్ (Sahana Singh) అనే రచయిత షేర్ చేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు అడవి జంతువుల సందడి మొదలయింది. పలు ప్రాంతాల్లో చిరుత పులులు ఎక్కువగా సంచరిస్తూ ప్రజలను కాస్త ఎక్కువగానే భయపెడుతున్నాయి అడవులను నరికివేస్తుండడంతో వన్యప్రాణులు (wild animals) అంతరించిపోతున్నాయి. అడవులతో పాటు జంతువులు కూడా కనుమరుగవుతున్నాయి. మరికొన్ని జంతువులు ఉండడానికి చోటు లేక గ్రామాల్లోకి వస్తున్నాయి
Somewhere in Karnataka. A leopard fell into a well and even when a “ladder” was offered, it was cowering inside. So they put a stick of fire near his bum which forced him to climb the scaffolding & run away into the jungle. How they rejoice! Man, Nature & Jugaad. 😊 Got it on WA. pic.twitter.com/OBr7kDTmlp