దేవర టికెట్ ధరను పెంచుకునేందుకు అనుమతినిచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవర సినిమా కోసం జీవో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమకు మీరు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు.’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్లో దేవర మూవీ విడుదల కానుంది.