శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్రావ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘స్త్రీ 2’ సినిమా అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకుపైగా వసూళ్లు(నెట్ కలెక్షన్స్) రాబట్టిన తొలి హిందీ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. 39 రోజుల్లో ఈ చిత్రం రూ.604.22 కోట్లు(నెట్) వసూల్ చేసిందని తెలిపింది. రూ.713 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసిందని పేర్కొంది.