మలయాళ హీరో బాలా ఇటీవల నాలుగో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన బంధువైన కోకిల అనే మహిళను పెళ్లి చేసుకోవడంపై ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా బాలా తన వివాహంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘మా పెళ్లి చూసి ఎవరైనా అసూయ పడితే.. అది వారి తప్పు. అమ్మాయిలు దొరక్క ఇబ్బందిపడే వారందరూ మమ్మల్ని చూసి కుళ్లుకుంటున్నారు’ అని అన్నారు.