కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర సినిమా నిన్న విడుదలైంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా అదరగొడుతోంది. అక్కడ 3.5 మిలియన్ డాలర్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించారు.