పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో ఓ పాట పాడినట్లు స్పష్టంచేశాడు. శింబుతో కలిసి తమన్, సుజీత్ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.