పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ త్వరలోనే ‘అమరన్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన.. ‘అమరన్’ కథ విన్నాక నిద్ర పట్టలేదని అన్నాడు. ఎలాగైనా ఈ స్టోరీని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. సైనికుడి శిక్షణ ఎలా ఉంటుంది? వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు? వంటి పలు అంశాలు ఇందులో కనిపిస్తాయన్నాడు.