గతంలో ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్‌ను ఉద్దేశించి నటి, యాంకర్ రష్మీ మాట్లాడిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన రష్మీ ట్వీట్ చేసింది. 2020 కంటే ముందే ఈ ఇంటర్వ్యూను ఇచ్చానని, దయచేసి ఇప్పుడు ఆ వీడియోను వాడొద్దని కోరింది. దీన్ని వైరల్ చేస్తూ నెటిజన్లను తప్పుదోవ పట్టించొద్దని పేర్కొంది. ఏదైనా విషయంలో ఓ మహిళ నో అని చెబితే.. దాన్ని గౌరవించాలని పేర్కొంది.