»You Are Vacated Rahul House But Karnataka People Get Lost To Statebandla Ganesh
Bandla Ganesh:రాహుల్ ఇల్లు ఖాళీ చేయిస్తే.. ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు
రాహుల్ గాంధీ ఇల్లును ఖాళీ చేస్తే.. మీరు రాష్ట్రాన్ని ఖాళీ చేసేలా కర్ణాటక ప్రజలు తీర్పును ఇచ్చారని బండ్ల గణేశ్ ట్వీట్ చేయగా.. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
You Are Vacated Rahul House But Karnataka People Get Lost To State:Bandla Ganesh
Bandla Ganesh:కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టనుండటంతో ఆ పార్టీ నేతల్లో జోష్ ఉంది. ఇక బండ్ల గణేశ్ (Bandla Ganesh) లాంటి నేతల్లో ఉత్సహం ఎక్కువే ఉంటుంది. కాసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
‘మీరు రాహుల్ గాంధీ (Rahul gandhi) ఇల్లు ఖాళీ చేయిస్తే.. కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు’ అని రాశారు. మోడీపై చేసిన కామెంట్లతో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం ఆయన లోక్ సభ (loksabha) సభ్యత్వం కోల్పోయారు. ఆ వెంటనే రాహుల్ గాంధీ (Rahul) ఇంటిని కూడా ఖాళీ చేయించారు.
ఇదే విషయాన్ని బండ్ల గణేశ్ (Bandla Ganesh) ప్రస్తావించారు. తమ నేత ఇల్లు ఖాళీ చేయిస్తే.. మీకు ఓ రాష్ట్రంలోనే చోటు లేదని పేర్కొన్నారు. దాంతోపాటు ఈ రోజు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) బర్త్ డే కాగా.. ఆయనకు విషెస్ తెలియజేశారు.
రాహుల్ గాంధీకి (Rahul) సపోర్ట్‌గా బండ్ల గణేశ్ చేసిన ట్వీట్‌కు కామెంట్లు జోరుగా వస్తున్నాయి. సెవెనో క్లాక్ బ్లేడు తీసుకు రమ్మంటావా బండ్ల అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మహా కూటమి అధికారం తథ్యం అని.. లేదంటే సెవెనో క్లాక్ బ్లేడుతో తన గొంతు కోసుకుంటానని కామెంట్ చేశారు. ఫలితాల తర్వాత ఓ రిపోర్టర్ సెవెనో క్లాక్ బ్లేడు, స్వీట్ బాక్స్‌తో బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.