Keerthy Suresh : కీర్తి సురేష్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. మహానటిగా అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం కీర్తి తన రూట్ మార్చేసింది. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటించిన తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. అప్పటి నుంచి హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతునే ఉంది.
కీర్తి సురేష్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. మహానటిగా అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం కీర్తి తన రూట్ మార్చేసింది. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటించిన తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. అప్పటి నుంచి హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతునే ఉంది. అయినా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు పెద్దగా రావడం లేదు. మధ్యలో పెళ్లి కూడా చేసుకోబోతోందనే వార్తలొచ్చాయి. కానీ కీర్తి పేరెంట్స్ పెళ్లి విషయాన్ని కొట్టిపారేశారు. అయితే రీసెంట్గా వెన్నెలగా దసరా సినిమాలో అదరొట్టేసింది కీర్తి సురేష్. మహానటి తర్వాత వెన్నెలగా మారిపోయింది. ఢీ గ్లామర్ రోల్లో కట్టిపడేసింది. ప్రస్తుతం దసరా సినిమా సక్సెస్‌ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది కీర్తి. ఈ సినిమాలో కీర్తి చేసిన తీన్మార్ స్టెప్పులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ప్రజెంట్ తెలుగులో మెగాస్టార్‌తో కలిసి భోళా శంకర్ సినిమాలో చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఇది తప్పితే తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయడం లేదు కీర్తి. కానీ తమిళ్లో మాత్రం నాలుగైదు సినిమాలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా కీర్తి ఐటెం సాంగ్ చేయబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏ సినిమా, హీరో ఎవరు? అనే విషయాలు తెలియకపోయినా.. కీర్తి ఐటెం సాంగ్ అనే సరికి ఆమె అభిమానులు కాస్త షాక్ అవుతున్నారు. హీరోయిన్గా కెరీర్ బాగానే ఉంది కదా.. ఇలాంటి సమయంలో ఐటెం పాటేంటని అంటున్నారు. కానీ ఇప్పటి కీర్తికి, మహానటి కీర్తికి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ బ్యూటీ ఐటెం సాంగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పొచ్చు. మరి నిజంగానే కీర్తి స్పెషల్ సాంగ్‌లో చిందేస్తుందేమో చూడాలి.