ఒక్కసారి సినిమా అనౌన్స్ అయిందంటే చాలు.. ఏదో ఒక రూమర్ వినిపిస్తునే ఉంటుంది. తాజాగా చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కాంబో పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఎన్టీఆర్ చేయాలనుకున్న ఈ సినిమాను.. చరణ్ ఎలా కమిట్ అయ్యాడు..
ఎన్టీఆర్ కథేనా, లేక కొత్త కథతో రాబోతున్నారా.. ఎన్టీఆర్ చెప్పడం వల్లే చరణ్ ఈ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. అయితే ఎన్టీఆర్‌కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఆ సినిమాను చేయలేకపోయాడట. అందుకే ఆ కథ రామ్ చరణ్‌కు వెళ్లిందని టాక్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
సుకుమార్ రైటింగ్స్, బుచ్చిబాబు అంటే ఖచ్చితంగా దేవీ శ్రీ ప్రసాద్ ఉండాల్సిందే. బుచ్చిబాబు ఫస్ట్ ఫిల్మ్ ఉప్పెనకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు దేవి. కానీ ఈ సినిమాకు మాత్రం దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తొంది. అనౌన్స్ చేసిన పోస్టర్లో దేవీ శ్రీ పేరు కనిపించలేదు. గతంలో కూడా సుకుమార్.. తన బ్యానర్ నుంచి వస్తున్న ఓ కొత్త చిత్రానికి దేవిశ్రీని తీసుకోలేదు.
అందుకే ఆర్సీ 16లో అతని పేరు లేదని అంటున్నారు. అసలు దేవిశ్రీ ప్రసాద్ ఉండగా.. బుచ్చిబాబు, సుకుమార్‌కు మరో ఆప్షన్ ఉండదు. కానీ ఆర్సీ 16 విషయంలో మాత్రం అలా లేనట్టేనని అంటున్నారు. ప్రస్తుతం దేవి ట్యూన్ ట్రాక్ పెద్దగా లేదు.. అందుకే చరణ్ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.