విశ్వక్ కొత్త సినిమాకు రంగం సిద్దమవుతోంది. ఈ ఏడాది ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ వంటి హిట్ తర్వాత.. ఇటీవలే ‘ఓరి దేవుడా’ అనే సినిమాతో అలరించాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక అప్ కమింగ్ ఫిల్మ్‌తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు మాస్ కా దాస్. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో టార్గెట్ చేశాడు.
విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’.. రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇటీవలె బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దాంతో ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. తెలుగు.. తమిళం.. మలయాళం..
హిందీ భాషల్లో.. మహా శివరాత్రి సందర్భంగా 2023 ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్టు.. ఒక కొత్త పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇందులో విశ్వక్ యాక్షన్‌లోకి దిగుతున్నట్టు చూపించారు. అయితే ఇప్పటికే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పలు తెలుగు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. దాంతో విశ్వక్‌కు పోటీ తప్పేలా లేదు.
ఇక వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ధమ్కీతో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. అయితే రీసెంట్గా యాక్షన్ కింగ్ అర్జున్ సినిమాను నుంచి బయటకొచ్చాడు విశ్వక్. అందుకే ధమ్కీతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు విశ్వక్. మరి దాస్ కా ధమ్కీ ఎలా ఉంటుందో చూడాలి.